![]() |
![]() |
.webp)
యాదమ్మ రాజు-స్టెల్లాకు బుల్లితెర మీద, సోషల్ మీడియాలో ఎంత ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలుసు. వీళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకుని ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు యాదమ్మ రాజు బర్త్ డే వేడుకలను స్టెల్లా గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసింది. యాదమ్మ రాజు కోట్ వేసుకుని ఈ సెలెబ్రేషన్స్ లో కనిపించాడు. పుట్టిన రోజు అని చెప్పి కేటరింగ్ బాయ్ ని చేసేసింది తన భార్య అంటూ ఫీల్ అయ్యాడు. ఇక తర్వాత రౌడీ రోహిణి, పవిత్ర వచ్చి నిజంగా కేటరింగ్ బాయ్ ని చేసేసి కావాల్సిన ఫుడ్ తెమ్మంటూ యాదమ్మ రాజును ఆట పట్టించారు. ఇక రాజు బర్త్ డే ఫంక్షన్ కి హిమజ, రోహిణి, సద్దాం, పవిత్ర, జ్ఞానేశ్వర్, టేస్టీ తేజ, జబర్దస్త్ ఇమ్మానుయేల్, బాబు వచ్చారు.
లేడీస్ అంతా కలిసి తీన్ మార్ ఆడారు, డిజెతో దంచి కొట్టారు. అలాగే అందరికి డిన్నర్ కూడా ఏర్పాటు చేశారు. యాదమ్మరాజు జబర్ధస్త్, ఎక్స్ట్రా జబర్ధస్త్ షోలతో ఫుల్ పాపులర్ అయ్యాడు. అప్పట్లో పటాస్ కామెడీ షో కూడా అంతే క్రేజ్ తెచ్చుకుంది. పటాస్ లో స్టూడెంట్ గా షోలో అడుగుపెట్టిన రాజు ఒక్క జోక్ తో హైలెట్ అయ్యాడు.. రాజు బాడీ లాంగ్వేజ్, కామెడీ టైమింగ్ బాగుండడంతో పటాస్ షోలో కామెడీ చేసే అవకాశం లభించింది. ప్రస్తుతం కమెడియన్స్ గా పేరుతెచ్చుకున్న సద్దాం, నూకరాజు, ఫైమా, ఇమ్మాన్యూయల్.. వాళ్లంతా కూడా పటాస్ షో నుంచి వచ్చిన వారే. ‘అదిరింది’ షోతో క్రేజ్ తెచ్చుకున్నాడు యాదమ్మ రాజు. స్టేజీ మీద యాదమ్మ రాజు, సద్దాం కాంబినేషన్ లో చేసిన కామెడీ స్కిట్ లు మంచి హిట్ అయ్యాయి. ఇక జబర్దస్త్ కమెడియన్స్ అందరికీ మూవీస్ లో కూడా మంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. యాదమ్మరాజు కూడా కొన్ని మూవీస్ లో కనిపిస్తున్నాడు. ఇక ఇప్పుడు యాదమ్మ రాజు బర్త్ డే సెలెబ్రేషన్స్ లో నెటిజన్స్ , ఫాన్స్, బుల్లితెర నటులంతా విషెస్ చెప్పరు.
![]() |
![]() |